మన పండుగలు

  

గాంధీ జయంతి

    జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భగా అక్టోబరు 2న దేశ వ్యాప్తంగా గాంధీ జయంతిని జరుపుకుంటారు.ఈ రోజును పురస్కరించుకుని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.అలాగే 15 జూన్ 2007 న ఐక్య రాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించింది.ఈ రోజున దేశ నాయకులు జాతిపితని స్మరించుకుంటూ గాంధీ సమాధిని ఉంచిన రాజ్ ఘాట్ (కొత్త డిల్లీ)లో ఘనంగా నివాళులు అర్పిస్తారు.