మన పండుగలు

              రంగుల పండుగ అయిన హోళీని హిందువులు ఆనందోత్సాహాల నడుమ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ వసంత ఋతువు ఆగమనానికి చిహ్నం.ఇది ప్రతీ సంవత్సరం పాల్గుణ శుద్ద పౌర్ణమి రోజున వస్తుంది. ఈ పండుగనే మనవారు కాముని పున్నమి,డొలికొత్సవము,మొదలైన పేర్లతో పిలుస్తారు.ఈ ఒకో పేరుకూ ఒక కధ ప్రచారంలో ఉంది.

హౌళి -
     రాక్షసరాజైన హిరణ్యకశివుడు బ్రహ్మ వరంతో విష్ణుమూర్తి మీద కోపంతో హద్దులు మరచి దేవతలను,మునులను అనేక రకాలుగా హింసిస్తాడు.దీనితో విష్ణుమూర్తి ప్రభావంతో హిరణ్యకశిపుడికి ప్రహల్లాదుడు జన్మిస్తాడు.ప్రహల్లాదుడు ఎపుడూ తనశత్రువైన విష్ణువుని ద్యానించడం ఇష్టంలేని హిరణ్యకశిపుడు అనేక రకాలుగా చంపాలని ప్రయత్నించి విఫలమవుతాడు.దీనితో తన చెల్లెలైన బ్రహ్మరాక్షసి హౌళికను ప్రహల్లాదున్ని చంపడానికి పంపుతాడు.ప్రహల్లాదుడు తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకోనగా విష్ణువు ప్రభావంచేత హోళిక మరణించినందుకు గుర్తుగా ఆనందోత్సోహలతో హోళి పండుగ గరుపుకుంటారు.

కాముని పున్నమి -
     సతీ వియోగంతో తపస్సులొ వున్న శివునికి,హిమవంతుని కుమార్తె అయిన పార్వతినిచ్చి దేవతలు వివాహం చేయ్యాలనుకుంటున్నారు.కానీ తపస్సులొ ఉన్న శివునికి ఎలా తపోభంగం కలిగించాలో అని ఆలోచించి మన్మధున్ని శివుని మీదకు పంపుతారు. మన్మదుడు తన భాణప్రబావంచే శివుని మనసుని పెళ్ళివైపు మరల్చుతాడు.దీనితో పార్వతీ,పరమేశ్వరుల వివాహం జరుగుతుంది.మన్మదభాణ ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మదుడు వల్ల తపోబంగం అయిందని గ్రహించి తన మూడవ నేత్రంతో భస్మంచేసేస్తాడు.పతీ వియోగభారంతో మన్మదుని భార్య రతిదేవి శివున్ని పరిపరి విధములుగా వేడుకోనగా శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా కేవలం మానసికంగా బ్రతికే వరం ఈ పాల్గుణ శుద్ద పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు.కాముడు తిరిగి బ్రతికిన రోజు కావున దీనిని కాముని పున్నమిగా పిలుస్తారు.
డోలికోత్సవము -
      పాల్గుణ శుద్ద పౌర్ణమి నాడే వెన్నదొంగ అయిన కృష్ణున్ని ఊయలలో (డోలికలో) వేసారట.అందుకే దీనిని డోలికోత్సవం అని పిలుస్తారు.ఈ పండుగను శ్రీకృష్ణున్ని నగరమైన మధురలో ఎంతో వైభవంగా 16 రోజులు పాటు నిర్వహించేవారట. మన పార్టిలు