మన పండుగలు
      భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 ఎంతో ప్రాముఖ్యమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం అయితే ఆగస్టు 15, 1947 లోనే వచ్చినప్పటికీ జనవరి 26న భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా మనది పూర్తి గణతంత్ర దేశం అయినది. ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయినది. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు ఈ 'గణతంత్ర రాజ్యం' ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు.

   గణతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతాయి. ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. తరువాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్ధులకు పతకాలు అందజేస్తారు. ఈ రోజును పురస్కరించుకొని రాజధానిలో గొప్ప గొప్ప పెరడ్‌లు జరుగుతుంటాయి.
   

   గణతంత్ర దినొత్సవాన్ని ఒక్క దేశ రాజధానిలోనే కాకుండా వివిధ రాష్ట్రాల రాజధానులతో పాటు ఊరూ వాడా అనే భెధం లేకుండా ప్రతీ చోటా జండా ను ఎగురవేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావులని స్మరించుకుంటారు.

మేరా భారత్ మహాన్