మన పండుగలు

  కార్మికుల దినోత్సవం
    మే1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ కార్మీకుడూ జరుపుకుంటాడు.రోజుకు ఎనిమిది గంటలు పనిగంటలుగా ఉండాలన్న పోరాటం సఫలమైన రోజు. కార్మికుల పోరాటాలకు గుర్తుగా మే1న మేడే వేడుకలు నిర్వహిస్తారు. కార్మికులకు సెలవు దినం అంటూ ఒకటి ప్రత్యేకంగా 1856లో అస్ట్రేలియాలో ప్రారంభమైంది. అయితే అప్పుడు కార్మికుల సెలవుదినం మే నెల ఒకటి కాదు, ఏప్రిల్ 22. అక్కడి ప్రభుత్వం ఏప్రిల్ 22ని సెలవు దినంగా ప్రకటించింది.ఆ తర్వాత దీనిని మే 1 కి మార్చారు.