మన పండుగలు

  

రంజాన్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు నిష్ట నియమాలతో పాటించే మాసం రంజాన్ మాసం.చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '

రంజాన్ నెలలో పూర్తి 30 రోజులు ఉపవాస దీక్ష పాటించాలి. సూర్యోదయం కంటే ముందే నిర్ధారిత సమయంలో ఆహార పానీయాలు తీసుకోవాలి. దీనిని ‘సహర్’ అంటారు. రంజాన్ ఉపవాసదీక్ష, నిరాహర, నిర్జల దీక్ష. ఉపవాస దీక్ష సమయంలో మందులు, మాకులు, ఇంజక్షన్లు, స్లైన్లు సైతం నిషేధం. పాన్, గుట్కా, సిగట్, బీడీలాంటి ధూమపానాలు కూడా నిషేధం. సూర్యాస్తమ సమయంలో ప్రతిరోజూ కొన్ని నిమిషాల తేడాతో ఉపవాస దీక్ష విరమణ నిర్దేశించడమైనది. దీన్ని ‘ఇఫ్తార్’ అంటారు. తియ్యని ఖర్జూర్, ఇతరత్రా ఫలాలతో ఉపవాస దీక్ష విరమిస్తారు. సహార్ మరియు ఇఫ్తార్ సమయాన్ని పూర్వకాలంలో ఆకాశంలో వెలుగు రేఖల్ని బట్టి నిర్ధారించేవారు. ఆధునిక సమాజంలో ప్రత్యేకంగా మోగే సైరన్లు ఉండటం సౌకర్యకరంగా మారింది. ఉపవాస దీక్షా సమయంలో విధిగా నమాజులు చేయాలి. అనైతిక ధర్మవిరుద్ధమైన, మరేవిధమైన దుష్కార్యాలకు పాల్పడకుండా ఉండాలి. అపవివూతమైన చర్యలవల్ల ఉపవాస దీక్ష సత్యలక్ష్యం దెబ్బతింటుంది.