మన పండుగలు

        తెలుగువారు పెద్దపండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగ రోజుల్లో కోత్త అల్లుళ్లతో,బంధుమిత్రులతో తెలుగు లోగిళ్ళు కళకళలాడతాయి.సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకరరాశి అందు ప్రవేశిస్తాడు.మకర సక్రమణం జరిగింది కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు.ఇది తరుచుగా జనవరి 14వ తేదిన వస్తుంది.సంక్రాంతి ముందు రోజు వచ్చే పండుగ భోగి.తరువాత రోజు వచ్చేది కనుమ.ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు.దీనిని ఆంధ్రప్రదేశ్,కర్నాటక రాష్ట్రాలలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు

         ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెలరోజులు ముందు నుండే పండుగ హడావిడి మొదలవుతుంది.ప్రతీ ఇంటిముందూ రంగురంగుల ముగ్గులు,గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి.వేకువ జామున హరినామ కీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మరులుస్తాడు.గంగిరెద్దులు,కొడిపందాలు,ఎడ్లపందాలు మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన సాంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లిపాదీ మిగతారోజులు ఎక్కడ ఉన్నా సరే ఈపండుగకు ఇళ్ళలో వాలిపోతారు.పిండివంటల తయారికి పండుగకు పదీరోజులు ముందు నుండే హడావిడి మొదలవుతుంది. అరిసెలు,పాకుండలు,చక్కినాలు,మిటాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు.ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికి వస్తుంది. దీనితో ఏ పండుగకైనా ఖర్చుకు వెనకాడతారేమో గానీ ఈరోజు మాత్రం సందేహించరు. అందుకేయేమో సంక్రాంతి సీజన్ లో తెలుగు సినిమాలు కనీసం అరడజనుకు తగ్గకుండా విడుదలవుతాయి. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేస్తారు. అందుకే దీనిని పతంగుల పండుగలని కూడా పిలుస్తారు.సంక్రాంతి రోజు వేకువజామునే నిద్రలేచి తలస్నానం చేసి తెలిగింటి ఆడపడుచులు సింగారిస్తూ ముగ్గులు పెడుతుంటే,పెద్దవాళ్ళు ఇంటికి తోరణాలు అలంకరిస్తారు. సేమ్యా,పాయసం,గారెలు,బురెలు మొదలైన పిండి వంటలు అరగించి పనివారికి,రజకులకు,క్షౌరకులకు ఇంకా చుట్టుపక్కలవారికి తాము వండుకున్న పిండివంటలను రుచి చూపిస్తారు.కొత్త అల్లుళ్ళకు ఈ పండుగ మరి ప్రత్యెకం ఎక్కడున్నా తొలి పండుగకు భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్ళడం అనావాయితి. వీరితో కొంటె మరదళ్ళు చేసే సందడి సరే సరి. పితృదేవతలకు ఈరోజున పితృదర్పణాలు సమర్పిస్తారు.ఈపండుగ ఒక ఎత్తు అయితే సంక్రాంతికి ముందు,వెనూకా వచ్చే పండుగలు ఒకెత్తు అవే భోగి,కనుమ.భోగి

      సంక్రాంతికి ముందురోజు వచ్చే పండుగ భోగి.ఈ పండుగ రోజున అందరూ వేకువజామునే నిద్ర లేచి ఇంట్లో ఉన్న పుల్లలు,పాతసామాగ్రి,ఆవుపేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు.వీటినే భోగి మంటలు అని పిలుస్తారు.ఆ తరువాత సాయంత్రం సమయంలో బోమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలువు ఎర్పాటు చేస్తారు.చంటి పిల్లలు ఉన్నవారు భోగి పళ్ళు పోసి ముత్తయిదువులందరికి వాటిని పంచుతారు. దీనినే భోగి పళ్ళు పండుగ అని కూడా అంటారు.

కనుమ
కనుమ పండుగ సంక్రాంతి తరువాత రోజు వస్తుంది. ఈ రోజున పశువులకు పూజ చేస్తారు.కనుమకు అందరూ మాంసహరం,మినప గారెలు వండుకుంటారు.దీని తరువాత వచ్చే పండుగ ముక్కనుమ.
ముఖ్యంగా ఈ మూడుపండుగలకు తెలుగులోగిళ్ళు భందుమిత్రులతో కళకళలాడతాయి.