మన పండుగలు

  

ఉపాధ్యాయ దినోత్సవం

    సెప్టెంబర్ 5 న దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి అదే రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉపా ధ్యాయ వృత్తి నుండి దేశ అత్త్యున్నత పదవిని అలంకరించిన సర్వేపల్లి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వ హిస్తున్నారు. పట్టణంలో అనేక కళాశాల, పాఠశాలల్లో విద్యార్థులు తమ గురువులను పూలమాలలతో, శాలువాలతో సత్కరించి తమ గురుభక్తిని చాటుకుంటారు.