అన్నదాత >> వ్యవసాయ అనుభంధములు

కుందేలు పెంపకం

కుందేళ్ళ పెంపకం ఎందుకు?
 • మన దగ్గరున్న తక్కువ పెట్టుబడి మరియు చిన్న స్థలంలోనే ఈ కుందేళ్ళ పెంపకం వలన ఎక్కువ రాబడి వస్తుంది.
 • కుందేళ్ళు సామాన్యమైన మేతను తిని దానిని అధిక ప్రోటీన్లు గల విలువైన మాంసంగా మార్చుకుంటుంది.
 • మాంసం ఉత్పత్తికొరకే కాకుండా దాని చర్మము మరియు బొచ్చు కొరకు కూడా  ఈ కుందేళ్ళను పెంచవచ్చును.

కుందేళ్ళ పెంపకం ఎవరు చేయవచ్చు?

స్వంతభూమి లేని రైతులకు, నిరక్షరాస్యులైన యువతకు మరియు స్త్రీలకు ఈ కుందేళ్ళ పెంపకం పార్ట్ టైమ్ ఉద్యోగము వలె వుండి అదనపురాబడిని ఇస్తుంది.


కుందేళ్ళ పెంపకం వలన ఉపయోగాలు
 • కుందేళ్ళ పెంపకం ద్వారా నాణ్యమైన ఎక్కువ ప్రోటీన్ కల్గిన మాంసమును మన కుటుంబం కొరకు పొందవచ్చును.
 • సులువుగా మన ఇంట్లో లభ్యమయ్యే ఆకులు , వ్యర్థమైన కూరగాయలు, గింజలు మేతగా వేసి  కుందేళ్ళను పెంచవచ్చు.
 • బ్రాయిలర్ కుందేళ్ళ పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.  మూడు నెలల వయస్సు లోనే రెండు కిలోగ్రాముల బరువు పెరుగుతుంది.
 • సంతతి పరిమాణం కుందేళ్ళలో చాలా ఎక్కువగా (సుమారు 8-12 వరకు)ఉంటుంది.
 • ఇతర మాంసాలతో పోల్చితే కుందేలు మాంసం అధికంగా మాంసకృత్తులు (21%), తక్కువ కొవ్వు (8%) కలిగి ఉంటుంది.కనుక పెద్దల నుండి పిల్లల వరకు ఈ మాంసం చాలా అనుకూలమైనది .

కుందేళ్ళ జాతులు 

ఎక్కువ బరువున్న జాతులు: (4-6 కిలోలు)

 • తెల్ల (వైట్) జైంట్
 • బూడిద రంగు ( గ్రే ) జైంట్
 • ఫ్లెమిష్ జైంట్

మధ్యరకపు బరువున్న జాతులు: (3-4 కిలోలు)

 • న్యూజిలాండ్ వైట్ (తెల్లని)
 • న్యూజిలాండ్ రెడ్ (ఎర్రని)
 • కాలిఫోర్నియన్

తక్కువ బరువు ఉండే జాతులు: (2-3 కిలోలు)

 • సోవియట్ చిన్ చిల్లా
 • డచ్


కుందేళ్ళ పోషణలో పద్ధతులు

మన పెరడులో తక్కువ పెట్టుబడితో నిర్మించిన చిన్న గూడు (పాక) లో కుందేళ్ళను పెంచవచ్చు.  వేసవి కాలం, వర్షాకాలం లాంటి వాతావరణ పరిస్థితుల నుండి మరియు కుక్కలు, పిల్లుల నుండి రక్షించుటకు గూడులను నిర్మించుట అవసరం.

కుందేళ్ళ పెంపకము రెండు విధానాలలో ఇంటి దగ్గర పెంచుకోవచ్చును.

ఎక్కువ (డీప్) కుందేళ్ళ పెంపక విధానము

ఈ పద్ధతి, తక్కువ సంఖ్యలో కుందేళ్ళను పెంచడానికి అనుగుణమైనది. కుందేళ్ళు నేలను రంధ్రాలు చేయకుండా అరికట్టడానికి గాను నేలను కాంక్రీటుతో గచ్చు చేయించాలి. వ్యర్థపదార్థాలయిన చెక్క నలి ధాన్యపు ఊక, ఎండుగడ్డితో నేలపై నాలుగు నుండి ఆరు అంగుళాల మందంగా నింపాలి. ఈ కుందేళ్ళ పెంపక (లిట్టర్) విధానము, ముప్ఫై కంటె ఎక్కువ కుందేళ్ళ పోషణకు సరియైనదికాదు.మగ కుందేళ్ళను విడిగా ఉంచాలి.ఎక్కువ పరిమాణంలో కుందేళ్ళ పెంపకం ఈ రకమైన విధానము లో పెంచకూడదు . ఈ పెంపక (లిట్టర్) విధానములో కుందేళ్ళు సులభంగా వ్యాధులకు గురి అవుతాయి. కుందేలు పిల్లల పెంపకం నిర్వాహణ కూడా ఈ పెంపక (లిట్టర్) విధానములో కష్టం.బోను విధానము

కుందేళ్ళను పెంచడానికి అవసరమైన నేల

 • పెద్ద మగ కుందేలు – 4 చదరపు అడుగులు
 • ఆడ కుందేలు – 5 చదరపు అడుగులు
 • పిల్ల కుందేళ్ళు – 1.5 చదరపు అడుగులు

పెద్ద కుందేలు బోనుః

పెద్ద కుందేలు బోను 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు కలిగి ఉండాలి. ఇటువంటి
బోను ఒక పెద్ద కుందేలుకు గాని లేక రెండు పెరుగుచున్న కుందేళ్ళకు గాని సరిపోతుంది.

పెరుగుచున్న కుందేలు బోనుః

 • పొడవు – 3 అడుగులు
 • వెడల్పు- 1.5 అడుగులు
 • ఎత్తు – 1.5 అడుగులు

పైన చెప్పిన కొలతలు గల బోను 4-5 కుందేళ్ళు మూడు నెలల వయస్సు వరకు సరిపోతుంది.

పిల్ల కుందేళ్ళను సాకడానికి బోనులు:

పెరుగుతున్న కుందేళ్ళను సాకడానికి ఉంచే బోనులే, పిల్ల కుందేళ్ళను సాకడానికి పనికి వస్తాయి.
కాని బోను అడుగుభాగాన మరియు చుట్టూ ఉన్న అన్ని ప్రక్కలు 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను(మెష్)తో తయారుచేసి ఉండాలి.  దీని వల్ల కుందేలు పిల్లలు బోను బయటికి రాకుండా అరికట్టబడతాయి.

గూడు పెట్టె :

కుందేలు పిల్లలను సాకే కాలంలో సురక్షితమైన ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం ఈ గూడు పెట్టెలు చాలా అవసరం.  ఈ గూడు పెట్టెలు జింకు పూతఉన్న ఇనుముతో గాని, చెక్కతో గాని తయారుచేయాలి.  ఈ గూడు పెట్టెల పరిమాణం, బోనులో పట్టే విధంగా ఉండాలి.

గూడు పెట్టె కొలతలు :

 • పొడవు – 22 అంగుళాలు
 • వెడల్పు-12 అంగుళాలు
 • ఎత్తు   – 12 అంగుళాలు

గూడు పెట్టెలు పై భాగము తెరచి ఉండేలా రూపొందించాలి. గూడు పెట్టె అడుగు భాగము 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను(మెష్)తో తయారుచేసి ఉండాలి. పదిహేను సెంటీమీటర్ల వ్యాసము కల్గిన గుండ్రని రంధ్రాన్ని గూడు పెట్టె పొడవుగా నున్నభాగంవైపు అడుగు భాగం నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో చేయాలి. ఆడ కుందేలు బోనులో నుండి గూడు పెట్టెలోనికి వెళ్ళుటకు ఈ రంధ్రం సహాయకారిగా ఉంటుంది. గూడు పెట్టె అడుగు భాగం నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో రంధ్రాన్ని రూపొందించడం ద్వారా కుందేలు పిల్లలు గూడు పెట్టెలోనుండి బయటకు రావడాన్ని నివారిస్తుంది.
పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు బోనులు :
పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు నిర్మించే బోనులు నేల నుండి 3 నుండి 4 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయాలి. ఈ బోనుల అడుగుభాగము నీళ్ళు, తెమ్మ చారని పదార్థంతో తయారుచేయాలి.
ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలుః

కుందేళ్ళ ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలు సాధారణంగా జింకు పూతఉన్న ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి.  ఆహారపు తొట్టెలు ‘J ‘(జె) ఆకారంలో బోనులకు బయటి వైపున బిగింపబడి ఉండాలి.  ఆహారానికి, నీటికి అయ్యే పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి వీటిని కప్పులలో కూడా పెట్టవచ్చు.


కుందేళ్ళ మేత యాజమాన్య పద్ధతులు

కుందేళ్ళు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి మరియు  చిక్కుళ్ళు, పచ్చిరొట్ట రకాలైన డెస్మంతస్, పశువులకు వేసే పచ్చిగడ్డి, అగాతి మరియు వంటింటి వ్యర్థపదార్థలైన కారెట్, క్యాబేజీ ఆకులు, ఇతర కాయగూరల వ్యర్థాలను కూడా కుందేళ్ళు ఇష్టపడతాయి.

కుందేళ్ళ మేతలో ఉండవలసిన పోషకాలు:

పోషకాల వివరాలు

పెరుగుదల కొరకు

పోషణ కొరకు

గర్భాధారణ కొరకు

స్తన్యము కొరకు

జీర్ణమయ్యే శక్తి(కిలో కేలరీలు)

2500

2300

2500

2500

మాంసకృత్తులు (%)

18

16

17

19

పీచు పదార్థాలు (%)

10-13

13-14

10-13

10-13

కొవ్వు (%)

2

2

2

2

ుందేళ్ళ మేతలో యాజమాన్యం గుర్తుంచుకోవలసిన విషయాలు

 • కుందేళ్ళ పళ్ళు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి.   అందుచే చిక్కని ఆహారంతో మాత్రమే కుందేళ్ళ పెంపకం అసాధ్యం.
 • కుందేళ్ళకు మేత ఖచ్చితంగా సమయం ప్రకారం పెట్టాలి. కుందేళ్ళకు ఆహారం ఇవ్వడం ఆలస్యమైతే అవి బెంబేలుపడి, నీరసించి బరువు తగ్గిపోతాయి.
 • ఎక్కువ ఉష్ణోగ్రత వలన కుందేళ్ళు పగటిపూట ఆహారం తీసుకోవు.  కాని అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి.  అందుచే రాత్రి పూట కుందేళ్ళకు పచ్చిరొట్ట ఆహారంగా పెడితే వ్యర్ధం చేయకుండా తింటాయి.  అందువలన ఉదయం పూట చిక్కని ఆహారం ఇవ్వాలి.
 • పౌష్టికాహారాన్ని చిన్న గుళికల రూపంలో ఇవ్వాలి.  ఇలా చిన్న గుళికల రూపంలో ఇవ్వడం వీలుకాక పోయినట్లయితే పౌష్టికాహారానికి నీటిని కలిపి చిన్న ఉండల రూపంలో కుందేళ్ళకు ఇవ్వాలి.
 •  ఒక కిలో బరువున్న కుందేలుకుః  రోజుకు 40 గ్రాముల పౌష్టికాహారం మరియు  40 గ్రాముల పచ్చిరొట్ట ఇవ్వాలి.
 • కుందేళ్ళకు ఎల్లప్పుడూ తాజాగా ఉండే పచ్చిరొట్టను మేతగా  ఇవ్వాలి. పచ్చిరొట్టను బోనులో నేల మీద వేయకూడదు కాని వాటిని బోనులో ప్రక్క భాగాలలోపలకు ఉంచవచ్చు.
 • కుందేళ్ళకు  రోజంతాపం శుభ్రమైన, నీటిని ఇవ్వాలి.

కుందేలు రకం

దాదాపు శరీరం బరువు

మేతపరిమాణం రోజుకి (గ్రాములలో)

పౌష్టికాహారం మేత

పచ్చి రొట్ట

మగ కుందేలు

4 - 5 కిలో గ్రాములు

100

250

ఆడ కుందేలు

4 - 5 కిలో గ్రాములు

100

300

పాలిచ్చే మరియు గర్భస్థ కుందేలు

4- 5 కిలో గ్రాములు

150

150

కుందేలు పిల్లలు

0.6-0.7 కిలో గ్రాములు

50-75

150

పౌష్టకాహారం మిశ్రమము యొక్క పాళ్ళు :

చేర్చబడిన పదార్థములు

మొత్తం

మొక్కజొన్న రవ్వ (నూక)

30 భాగాలు

సజ్జల రవ్వ

30 భాగాలు

వేరుశనగ చెక్కపిండి

13 భాగాలు

గోధుమ పొట్టు

25 భాగాలు

ఖనిజ మిశ్రమం (లవణమిశ్రమం )

1.5 భాగాలు

ఉప్పు

0.5 భాగంకుందేలు జాతి పెంపకంలో యాజమాన్య పద్ధతులు
సంతానోత్పత్తి వయస్సు
 • ఆడ కుందేలు -   5-6 నెలలు
 • మగ కుందేలు -  5-6 నెలలు (మగ కుందేలు -  5-6 నెలలు వయస్సు వచ్చినప్పటికీ ఒక సంవత్సరము తరువాత మాత్రమే సంతానోత్పత్తి కొరకు .వినియోగించాలి దిని వల్ల నాణ్యతగల కుందేళ్ళను పొందవచ్చు.


సంతానోత్పత్తి కొరకు కుందేళ్ళ ఎంపిక
 • సంతానోత్పత్తికై కుందేళ్ళను 5 - 8 నెలలు తరువాత పూర్తిగా బరువును సంతరించుకున్న తరువాత ఎంపిక చేయాలి.
 • ఎక్కువ సంతతి పరిమాణంఉన్న కుందేళ్ళనుంచి, మగ మరియు ఆడ కుందేళ్ళును సంతానోత్పత్తి కొరకు ఎంపికచేయాలి.  
 • ఆరోగ్యవంతమైన కుందేళ్ళను మాత్రమే సంతానోత్పత్తికి ఎంపికచేయాలి. ఆరోగ్యవంతమైన కుందేళ్ళు చురుకుగా ఉంటాయి. మేత మరియు నీటిని మమూలుగా తీసుకుంటాయి.  వీటన్నిటికీ మించి అవి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాయి.ఆరోగ్యకరమైన కుందేళ్ళ బొచ్చు పరిశుభ్రంగా , మెత్తగా మరియు మెరుపు గలిగి ఉంటాయి.
 • సంతానోత్పత్తికై ఉపయోగించే మగ కుందేళ్ళుకు పైన పేర్కొన్న లక్షణాలతో పాటు స్పష్టమైన బాగా క్రిందికి దిగిన రెండు వృషణాలు బీజకోశములో ఉంటుది .
 • మగ కుందేళ్ళను ఎంపిక చేసేటప్పుడు, వాటి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తెలుసు కోవడానికి మగ కుందేళ్ళను ఆడ కుందేళ్ళతో జత కట్టిస్తారు.


ఆడకుందేళ్ళ జతకావడాన్కి లేదా ఎద సంకేతాలు

కుందేళ్ళలో ప్రత్యేకంగా గర్భధారణ సమయము అంటూ ఏదీలేదు. ఎప్పుడైతే ఆడ కుందేలు మగ కుందేలుతో జత కట్టనిస్తుందో అప్పుడు ఆడ కుందేలుకి గర్భధారణ సమయమని భావించాలి.  ఒక్కొక్కప్పుడు ఆడ కుందేలు యోని ఎర్రగా ఉబ్బితే అది యదలు ఉన్నదని భావించాలి.  ఎప్పుడైతే మగ కుందేలును యదలో ఉన్న లేదా గర్భధారణ కాంక్షలో నున్న ఆడ కుందేలు వద్దఉంచినపుడు ఆడ కుందేలు వీపుని నొక్కిపెట్టి వెనక భాగాన్ని ఎత్తి చూపిస్తుంది. ఆడ కుందేలు యదలో లేక పోయి నట్లయితే, బోను మూలకు పోయి మగ కుందేలుపై దాడి చేస్తుంది.కుందేళ్ళ గర్భధారణ

కుందేళ్ళ గర్భధారణ వివరములు

మగ, ఆడ  కుందేళ్ళ నిష్పత్తి 

1 :10

మొదటి కలయిక వయస్సు

5 – 6 నెలలు . మంచి సంతానోత్పత్తి కొరకు మగ కుందేళ్ళు ఒక సంవత్సరము వయస్సు వచ్చిన తరువాత మొదటిసారి ఆడ కుందేళ్ళతో జత కట్టిస్తే లిట్టర్ సైజు పెరుగుతుంది .

జతకట్టే సమయంలో ఆడ కుందేళ్ళ శారీరక బరువుః

2.25 -2.50 కిలో గ్రాములు

గర్భధారణ సమయం

28 -31 రోజులు

తల్లిపాలు త్రాగుట మాన్పించబడే వయస్సు

6 వారాలు

కాన్పు తరువాత జతకట్టే సమయం

కాన్పు లేదా కుందేలు పిల్లలు తల్లి పాలు త్రాగుట మానిన 6 వారాల తరువాత.

అమ్మదగిన వయస్సు

12 వారాలు

అమ్మకము సమయంలో ఉండవలసిన శరీరము బరువు

సుమారుగా రెండు కిలోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ

ఆడ కుందేలు యద లేదా గర్భధారణ సూచనలు వెల్లడించినప్పుడు, మగ కుందేళ్ళ బోను లోకి ప్రవేశపెడతారు. ఆడ కుందేలు జతకట్టే సరైన సమయంలో ఉంటే తోక ఎత్తి మగ కుందేలును జతకట్టడానికి ఆహ్వానిస్తుంది.   జతకట్టే ప్రక్రియ విజయవంతగా పూర్తవగానే మగ కుందేలు ఒక ప్రక్కకు పడిపోతుంది మరియు ఒక  నిర్ధిష్టమైన ధ్వనిని చేస్తుంది.  ఒక మగ కుందేలును వారంలో మూడు లేదా నాలుగు రోజులకి మించి జత కట్టే కార్యక్రమంలో ఉపయోగించకూడదు.  అదే విధంగా మగ కుందేలును రోజుకు రెండు లేదా మూడు సార్లుకి మించి జతకట్టు కార్యక్రమంలో ఉపయోగించ కూడదు.  జతకట్టు కార్యక్రమంలో పాల్గొన్న మగ కుందేళ్ళకు సరిపడినంత విశ్రాంతి మరియు మంచి పోషకాహారము ఇవ్వాలి.   కుందేళ్ళ సమూహంలో ప్రతి పది ఆడ కుందేళ్ళకు ఒక మగ కుందేలుని  ఉంచాలి.  ఒకటి లేదా రెండు మగ కుందేళ్ళని అదనంగా కుందేళ్ళ ఫారంలో పెంచవచ్చు. ఏదైనా కుందేలు వ్యాధి బారినపడినప్పుడు అదనంగా పెంచబడిన మగ కుందేళ్ళను జతకట్టే కార్యక్రమంలో ఉపయోగించవచ్చు.

బ్రాయిలర్ కుందేళ్ళ గర్భధారణ సమయం 28 – 31 రోజులు.  ఆడ కుందేలు మగ కుందేలుతో జతకట్టిన 12-14 రోజుల తర్వాత మన చేతివేళ్ళతో వాటి ఉదరాన్ని తాకడం ద్వారా అవి గర్భంతో ఉన్నదీ లేనిదీ మనము తెలుసుకొనవచ్చును.  గర్భనిర్ధారణను మన రెండువేళ్ళతో వాటి వెనుక కాళ్ళ మధ్యనగల పొత్తికడుపును  స్పర్శించుటద్వారా  తెలుసుకొనవచ్చును. ఒక గుండ్రటి గడ్డ వంటిది వ్రేళ్ళకు తగిలితే ఆ కుందేలు  గర్భం ధరించిందని భావించాలి. జతకట్టిన 12-14 రోజుల తర్వాత కూడా ఆడ కుందేలు గర్భం ధరించకపోతే వాటిని తిరిగి మగ కుందేలుతో జతకట్టిస్తారు.  ఆ విధంగా ఆడ కుందేలు మూడుసార్లు మగ కుందేలుతో జతకట్టించిన తర్వాత కూడా  గర్భం దాల్చకపోతే ఆ కుందేలుని ఆ పెంపక కేంద్రం నుండి వేరు చేయాలి .

జతకట్టిన 25 రోజుల తర్వాత గర్భస్థ కుందేళ్ళ శారీరక బరువు 500-700గ్రాములు పెరుగుతుంది.  ఈ పెరిగిన బరువును ఆ కుందేళ్ళను పైకెత్తుట ద్వారా గమనించవచ్చు. గర్భస్థ కుందేలును మగ కుందేళ్ళ వద్దకు పంపినట్లయితే అవి జతకట్టవు.


గర్భం దాల్చిన ఆడకుందేళ్ళ సంరక్షణ

గర్భనిర్ధారణ జరిగిన తర్వాత వాటికి ఎక్కువ మొత్తంలో అధిక పోషణగల మేతను 100 నుండి 150 గ్రాముల సాధారణ మేత కంటే అధికంగా ఇవ్వాలి.  ఆ గర్భం దాల్చిన కుందేళ్ళను 25 రోజుల తర్వాత పిల్లలను కనే బోనులోకి మార్చాలి.  కాన్పుకు ఐదు రోజుల ముందు గూడు పెట్టెను బోనులోకి చేర్చాలి.  ఎండు కొబ్బరి పీచు లేదా వరిగడ్డిని మెత్తగా బోను క్రింది భాగంలో పేర్చాలి .  గర్భస్థకుందేలు తన పొట్టపై నున్న వెంట్రుకలను పీక్కొని, ఒకటి లేదా రెండు రోజులలో ఈనుటకు ముందు,వాటి పిల్లలకు గూడులా ఏర్పాటు చేస్తాయి.  ఈ సమయంలో కుందేళ్ళ ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఏ ఒక్కరిని బోను వద్దకు అనుమతించరాదు.

మామూలుగా ఉదయం వేళలో కుందేళ్ళు ఈనడం జరుగుతుంది.  ఈనడానికి 15 నుండి 30 నిమిషములు పడుతుంది.  ఆ తల్లి కుందేలు ఉదయమే తన పిల్లలను తానే శుభ్ర పరుస్తుంది. ప్రతి రోజు ఉదయమే గూడు పెట్టెను పరిశీలించాలి.  చనిపోయిన పిల్లలను గూడు పెట్టె నుంచి తొలగించాలి.  గూడు పెట్టెను పరిశీలిస్తున్నపుడు తల్లి కుందేలు కలతచెందుతుంది.  అందువల్ల తల్లి కుందేలును గూడు పెట్టె పరిశీలనకు ముందే అక్కడనుంచి తొలగించాలి.

అనారోగ్యముగా నున్న కుందేళ్ళ లక్షణాలు
 • నిస్తేజంగా మరియు నీరసించి ఉండడం
 • శారీరక బరువు కోల్పోవడం మరియు కృశించిపోవడం
 • ఎక్కువగా బొచ్చు ఊడిపోవడం
 • చలాకీగా లేకపోవడం.  కాని మామూలుగా,ఎప్పుడూ బోనులో ఒక నిర్ధష్టప్రదేశంలోనే గడపడం
 • నీరు మరియు శ్లేష్మంలాంటి స్రావాలు కంటి నుండి, ముక్కు నుండి, మలద్వారం మరియు నోటి నుండి స్రవించట.
 • శారీరక ఉష్ణోగ్రతలో మరియు శ్వాసలో పెరుగుదల

కుందేళ్ళలో వ్యాధులు
పాస్ట్యురెల్లోసిస్

ప్రేగులకు సంబంధిత రోగం (ఎంటిరైటిస్) :

మెడ వాల్చు రోగము

స్తనముల వాపు రోగము (మాన్ టైటిస్) :