అన్నదాత >> వ్యవసాయ అనుభంధములు

మేకల పెంపకం

 
భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతిప్రముఖమైన ఉపాధి. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడి తో లాభదాయక వృత్తి.

ఎవరు మొదలుపెట్టవచ్చు?
 • చిన్న మరియు సన్నకారు రైతులు
 • భూమి లేని రైతుకూలీలు
 • అందరికీ అందుబాటులో ఉండే పచ్చికబయళ్ళు ఉన్న ప్రదేశాలలో

ఏజాతివి మీకు సరైనవి?

జమునాపరి

 • సాధారణంగా కాస్త ఎత్తుగా ఉంటుంది.
 • బలమైన,వంపుదిరిగినముక్కు, సుమారు 12 అంగుళాల పొడవుండే ఊగులాడే చెవులు బాగా ఎదిగిన జమునాపరి మేకలకు ఉంటాయి.
 • మేకపోతు 65-85 కిలోగ్రాములు, ఆడ మేక 45-60 కిలోగ్రాములు తూగుతాయి
 • ప్రతి ఈతకూ ఒక మేక ఆరు నెలలవయసున్న మేకపిల్ల సుమారు 15 కిలోగ్రాముల బరువుంటుంది.
 • రోజుకి 2-2.5 లీటర్ల పాలనిస్తాయి
 

తెల్లిచెరి

 • మేకలు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి
 • ప్రతి ఈతకూ 2-3 పిల్లలు
 • మగమేక 40-50 కిలోగ్రాములు, ఆడగొర్రె 30 కిలోగ్రాములు తూగుతాయి
 

బోయర్

 • మాంసం కోసం ఈజాతిని ప్రపంచమంతా పెంచుతున్నారు
 • అత్యంతశీఘ్రంగా ఎదుగుతాయి
 • మగమేక 110-135 కిలోగ్రాములు, ఆడమేక 90-100 కిలోగ్రాములు, తూగుతాయి
 • మేకపిల్లలు 90 రోజుల్లో 20-30 కిలోగ్రాములు తూగుతాయి

ఆహారపు నిర్వహణ
 • పచ్చికబయళ్లలో మేతతోపాటుగా శ్రద్ధగా పెట్టే దాణావల్ల ముమ్మరమైన ఎదుగుదల మాంసకృత్తులు సమ్మృద్ధిగా లభించే తుమ్మ,కస్సవె,లెకుయర్ని లాంటి ఆకుపచ్చటి దాణావల్ల ఆహారరూపములో నత్రజని బాగా లభిస్తుంది.
 • రైతులు పొలం గట్లవెంబడి అగతి,సుబాబుల్,గ్లారిసిదియ చెట్లను పెంచి ఆకుపచ్చటి దాణాగా వాడవచ్చు.
 • ఒక్క ఎకరం చేలో పండించే చెట్లు,ఇతరదాణా మొక్కలు 15-30 మేకలకు ఆహారంగా సరిపోతాయి

మిశ్రమదాణాన్ని ఇలా తయారు చెయ్యవచ్చు


దినుసులు     

పిల్లల దాణా    

ఎదుగుదలకు దాణా  

పాలిస్తున్న మేకకు దాణా  

సూడిమేకకు దాణా

మొక్కజొన్న

37

15

52

35

కాయధాన్యాలు

15

37

---

---

తెలకచెక్క      

25

10

8

20

గోధుమ తవుడు

20

35

37

42

ఖనిజమిశ్రమం

2.5

2

2

2

ఉప్పు   

0.5

1

1

1

మొత్తం

100

100

100

100

పిల్లలకు మొదటి పది వారాలు 50- 100 గ్రాముల ద్రావణాన్ని ఇవ్వాలి. ఎదుగుతున్న వాటికి 100 -150 ద్రావణాన్ని ప్రతిరోజూ 3-10 నెలలపాటు ఇవ్వాలి. సూడి మేకలకు రోజూ 200 గ్రాముల ద్రావణాలను ఇవ్వాలి. ఒక కిలోగ్రాము పాలిస్తున్న మేకలకు 300 గ్రాముల ద్రావణాన్ని ఇవ్వాలి. మేకలపాకల్లో ఖనిజాలదిమ్మలను మంచిరాగితో ( 950-1250 పిపియం) ఏర్పాటు చెయ్యాలి.


సంతతివృద్ధి నిర్వహణ

లాభదాయకమైన సంతతివృద్ధికి రెండేళ్ళకు మూడు ఈతలుండాలి శీఘ్రంగా ఎదిగే, భారీపరిమాణములోని మేకలను సంతతివృద్ధికి వాడుకోవాలి. ఏడాది ఈడున్న ఆడమేకలను సంతతివృద్ధికి వాడాలి.
గర్భందాల్చాక ఆడమేక మూడు నెలలలోగా ఈనాలి. అలాగయితేనే రెండేళ్ళకు మూడుసార్లు ఈనుతాయి
మేకలు రమారమి ప్రతి 18 నుండి 21 రోజుల కొకసారి ఎదకొస్తాయి ఇది 24-72 గంటలపాటు ఉంటుంది
ఎదకొచ్చిన మేకలు ఎక్కువగా అరుస్తుంటాయి, కొన్ని బాధతోకూడిన కూతలు పెడుతుంటాయి. తోకను ఒక వైపు నుంచి మరొక వైపుకు ఆపకుండా ఊపుతూ ఉండటం ఎదకొచ్చిన వాటి లక్షణాలలొ మరొకటి. అదనంగా యోని రంధ్రం వాచినట్టు, ఎర్రగా కనిపిస్తుంది, మరియు  యోనిస్రావాల వల్ల, తోకచుట్టూ తడిగా, మురిగ్గా కనిపిస్తుంది. దాణామీద యావ తగ్గి తరచూ మూత్రవిసర్జన చేస్తుంటాయి. ఎదకొచ్చిన ఆడమేక మరొక ఆడమేక, మగమేకలాగా  మీద ఎక్కటమో, లేదా మరొక ఆడమేక ను తనమీద ఎక్కనివ్వటమో చేస్తుంటాయి.

 • ఎదకొచ్చిన 12-18 గంటలలో ఆడమేకను జతకట్టించవచ్చు.
 • కొన్ని ఆడమేకలలో ఎద లక్షణాలు 2-3 రోజులపాటు కొనసాగుతాయు, కాబట్టి వాటిని ఆ మరుసటి రోజు జతకట్టించవచ్చు.
 • గర్భధారణ సమయం రమారమి 145-150 రోజులు కానీ ఒకవారము అటూ ఇటూ కావడము సహజం,కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం.

వ్యాధినిరోధకటీకాలు వేయించటం

పిల్లలకు ఎనిమిదివారాల వయసులో, మరలా పన్నెండువారాలకు ఎంటెరోటాక్సేమియా మరియు టెట్నస్ వ్యాధినిరోధకటీకాలు వేయించాలి.
ఆడమేకలకు చూలుకు 4-6  వారాల ముందు,ఈనిన తర్వాత 4-6 వారాలకు ఎంటెరోటాక్సేమియా మరియు టెట్నస్ వ్యాధినిరోధకటీకాలు వేయించాలి.
మేకపొతులకు ఏడాదికి ఒకసారి ఎంటెరోటాక్సేమియా మరియు టెట్నస్ వ్యాధినిరోధకటీకాలు వేయించాలి.


పెంపకం పద్ధతులు

1. అర్ధ సాంద్ర పద్ధతి

 • పచ్చిక బయళ్ళు తక్కువగా ఉన్నచోట, మేకలకు మేతతర్వాత, ముమ్మరంగా ఆకుపచ్చదాణా, ద్రావణాలనివ్వాలి

2. సాంద్ర పద్ధతి

 • పాకలోని మేకలకుఆకుపచ్చదాణా,ద్రావణాలనివ్వాలి
 • బయళ్ళలో తిప్పకూడదు
 • పాక డీప్ లిట్టర్ పద్ధతిలో గాని,ఎత్తైన అరుగు పద్ధతిలో గాని ఉండొచ్చు

మేకలభీమా
 • నాలుగవనెలవయసు నుంచి సాధారణభీమా కంపీనీలచే మేకలను భీమా చేయించవచ్చు.
 • వ్యాధులతోగానీ,ప్రమాదవశాత్తు గాని చనిపోతే భీమా సొమ్మును కోరవచ్చు.