అన్నదాత >> వ్యవసాయ అనుభంధములు

టర్కీ కోళ్ల పెంపకం

ఇండియాలో టర్కీ కోళ్ళ జాతులు

టర్కీ కోళ్ళ రకాలు ఇవీ:

1. బోర్డ్ బ్రెస్టెడ్ బ్రాంజ్:
నిజానికి ఈ రకం టర్కీ కోళ్ళ ఈకలు కంచు(బ్రాంజ్) రంగులో కాక, నల్ల రంగులో వుంటాయి. ఆడ కోళ్ళకు రొమ్మువద్ద తెల్ల మొనలున్న నల్లని ఈకలుంటాయి. కేవలం 12 వారాల వయసుకే అది ఆడకోడి అని గుర్తించడానికి ఇవి తోడ్పడతాయి.

2. బోర్డ్ బ్రెస్టెడ్ వైట్:
ఈ రకం బోర్డ్ బ్రెస్టెడ్ బ్రాంజ్ కోడి మరియు సాంకర్యం వల్ల తెల్ల ఈకల వైట్ హాలండ్ కోడి, కలిగే సంకరజాతి టర్కీ కోఢి. ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి కనుక, భారతదేశ వాతావరణ పరిస్థితులకు ఈ తెల్ల ఈకల కోళ్ళు బాగా అనువుగా వుంటాయనిపిస్తుంది. ఇంతేకాకుండా, ఈకలు తీసి, డ్రెస్సింగ్ చేసిన కోడి శుభ్రంగా, చూడడానికి ఇంపుగా వుంటుంది.

3.తెల్లని చిన్నరకం బెల్ట్ స్విల్లె:
రంగులో, ఆకారపు తీరులో ఇది , బోర్డ్ బ్రెస్టెడ్ వైట్ రకం కోడిని బాగా పోలివుంటుంది. అయితే, సైజులో చిన్నదిగా వుంటుంది. బరువైన రకాలతో పోలిస్తే, గుడ్లు పెట్టగలగడంలో, గుడ్ల ఉత్పత్తిలో, పొదగడంలో ఇవి మేలనిపిస్తాయి. అయితే, పొదిగిన తర్వాత మొదటి 4 వారాలలోపు తన పిల్లల ఆలన పాలన చూసుకునే (బ్రూడింగ్) విషయంలో మాత్రం ఈ రకం కోళ్ళు మెరుగు కాదనిపిస్తాయి.

4. నందనం టర్కీ1:
నందనం టర్కీ 1 అనేది, దేశవాళీ నల్లకోడి, మరియు విదేశీ రకానికి చెందిన తెల్లని చిన్నరకం బెల్ట్ స్విల్లె కోడి సాంకర్యంవల్ల పుట్టే సంకరజాతి కోడి. తమిళనాడు వాతావరణ పరిస్థితులకు ఇది అనువుగా వుంటుంది.


టర్కీ కోళ్ళ పెంపకంలో ఆర్ధికాంశాలు

పుంజుపెట్ట నిష్పత్తి

1:5

గుడ్డు సగటు బరువు

65 గ్రాములు

అప్పుడే  పుట్టిన  కోడిపిల్ల సగటు బరువు

50 గ్రాములు

జత కలవడానికి శారీరక ఎదుగుదల వయసు (మెచ్యూరిటి)

30 వారాలు

సగటు గుడ్ల సంఖ్య

80 - 100

పొదగడానికి పట్టే సమయం

28 రోజులు

20 వారాలకు సగటు బరువు
పుంజు ……………………………………..   
పెట్ట…………………………………………

7 - 8 కిలోలు
4.5-5.0 కిలోలు     

గుడ్లు పెట్టే వ్యవధి

24 వారాలు

అమ్మదగిన (మార్కెట్‌చేయదగిన) వయసు
పుంజు ……………………………………..   
పెట్ట…………………………………………

14 - 15 వారాలు
17 - 18 వారాలు

అమ్మదగిన (మార్కెట్‌చేయదగిన) బరువు
పుంజు ……………………………………..   
పెట్ట…………………………………………

7.5 కిలోలు
5.5 కిలోలు

ఆహార సామర్ధ్యం

2.7 - 2.8

అమ్మదగిన (మార్కెట్‌చేయదగిన) వయసు వరకు సగటున తినే దాణా  
పుంజు ……………………………………..   
పెట్ట…………………………………………

 

24-26 కిలోలు
17-19 కిలోలు

మొదటి 4 వారాలలోపు చనిపోయే కోడిపిల్లల శాతం

3 - 4 %

టర్కీ కోళ్ళ పెంపకంలో యాజమాన్య పద్ధతులు

I. పొదగడం

టర్కీ జాతి కోళ్ళు పొదగడానికి పట్టే కాలం 28 రోజులు. పొదగడం రెండు రకాలు.

ఎ) ప్రకృతి సహజంగా, కోడిపెట్ట పొదగడం. టర్కీలు పొదిగే విషయంలో పేరుపొందినవి. పొదిగే పెట్ట

ఒకేసారి 10 - 15 గుడ్లను పొదుగుతుంది. గుడ్ల పొదుగుదల 60 - 80 శాతం వరకు వుండి, పిల్లలు ఆరోగ్యవంతంగా వుండాలంటే, గుడ్డు ఆకారము, గుడ్డు పై పెంకు బాగా వుండి, శుభ్రంగా వుండే గుడ్లను మాత్రమే పొదగడానికి వుంచాలి.బి) కృత్రిమంగా పొదగడం

గుడ్లను ఇంక్యుబేటర్లలో వుంచి యాంత్రికంగా పొదగడాన్ని, కృత్రిమంగా పొదగడం అంటారు.

ఇంక్యుబేటర్ లోని సెట్టర్ , హాచర్ లో వుండవలసిన ఉష్ణోగ్రత, గాలిలో తేమ వివరాలు

ఉష్ణోగ్రత (ఫారన్ హీట్ డిగ్రీలు)

గాలిలో తేమ (శాతం)

సెట్టర్                           99.5

61 - 63

హాచర్                           99.5

85 - 90

రోజూ ప్రతి గంటకొకసారి గుడ్లను పై భాగం కిందికి, కిందిభాగం పైకి తిప్పాలి. తడిలేకుండా చూడడానికి, గుడ్లు పగలకుండా నివారించడానికి, ఎక్కువ శాతం గుడ్లనుంచి పిల్లలు రావడానికి వీలుగా తరచుగా గుడ్లను సేకరించాలి.

దాణా:

దాణా రెండురకాలుగా ఇవ్వవచ్చు. ఒకటి: దంచి ఇవ్వడం, రెండు: గుళికల రూపంలో ఇవ్వడం   
* దేశవాళీ కోడిపిల్లలతో పోల్చిచూస్తే, టర్కీలకు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజలవణాలు, శక్తిని ఇచ్చే పదార్ధాలు మరింతగా అవసరమవుతాయి
* శక్తిని ఇచ్చే పదార్ధాలు, మాంసకృత్తులు అవసరమయ్యే పరిమాణం పుంజుకు ఒకరకంగా, పెట్టకు మరొక రకంగా వుంటుంది; అందువల్ల, వాటిని వేరువేరుగా పెంచితే మంచి ఫలితాలు సాధించవచ్చు
* దాణా పాత్రలోనే దాణాను వేయాలి; నేలమీద వేయకూడదు
* ఒకరకమైన దాణాకు బదులు మరొక రకమైన దాణాఇవ్వవలసివస్తే, ఆ మార్పు క్రమేణా జరగాలి
* టర్కీలకు శుభ్రమైన నీరు  తెంపులేకుండా ఎప్పుడూ అందుబాటులో వుంచాలి 
* ఎండాకాలంలో మరిన్ని నీటిపాత్రలు పెట్టాలి
* ఎండాకాలంలో పగటిపూట ఎండ తక్కువగావుండే వేళలలో దాణా మేపాలి
* కాళ్లు చచ్చుబడిపోకుండా, ఒక్కొక్క టర్కీకి రోజుకు 30 - 40 గ్రాముల వంతున ఆల్చిప్పల పొడిని వేయాలి  

మొక్కలు,గడ్డి మేపడం

షెడ్లలో పెంచే పద్ధతిలో, టర్కీకి మొత్తం దాణాలో 50 % మొక్కలను, ఆకులను దంచి ఇవ్వవచ్చు. ఏ వయసులో టర్కీకైనా, తాజా జనుము మొక్క మంచి బలవర్ధక ఆహారం. ఇంతేకాకుండా స్టైలో గడ్డిని, దేశ్‌మంతస్ మొక్కనుకూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపి దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు.టర్కీ బరువు మరియు దాణా పరిమాణం

వయస్సు
(వారాలలో) 

టర్కీ సగటు బరువు
(కిలోలు)
పుంజు          పెట్ట 

తినే మొత్తం దాణా (కిలోలు)
పుంజు          పెట్ట 

ఆ స్థాయి వరకు  మొత్తం దాణా సామర్ద్యం
పుంజు             పెట్ట 

4 వారాల వరకు   

0.72             0.63

0.95              0.81

1.3                    1.3

8 వారాల వరకు   

2.36             1.90

3.99              3.49

1.8                    1.7

12 వారాల వరకు  

4.72             3.85

11.34            9.25

2.4                     2.4

16 వారాల వరకు  

7.26             5.53

19. 86         15.69

2.8                     2.7

20 వారాల వరకు 

9.62             6.75

28.26          23.13

3.4                     2.9

పునరుత్పత్తి పద్ధతులు
సహజంగా జతకూడడం:

కోడి పుంజు జతకోసం ఆరాటపడే తీరును కూతకు రావడం (స్ట్రట్) అంటారు. ఆ సమయంలో అది తన రెక్కలను విచ్చుకుని, ప్రత్యేకమైన రీతిలో అరుస్తుంది. సహజంగా జతకూడే విషయంలో పుంజు : పెట్ట నిష్పత్తి మధ్యరకం టర్కీలైతే 1:5, పెద్దరకం టర్కీలయితే 1:3. జతకూడిన పెద్ద ఆడటర్కీ సగటున ఒక్కొక్కటి 40-50 గుడ్లు పెడుతుంది. ఏడాది వయస్సు నిండిన మగ టర్కీలలో లైంగిక శక్తి సన్నగిల్లుతుంది, అందువల్ల వీటిని వీలున్నంతవరకు జతకూడడానికి ఉపయోగించకూడదు. ఎదిగిన మగ టర్కీలలో, ఏదో ఒక ఆడ టర్కీపట్ల మక్కువపెంచుకునే స్వభావం వుంటుంది; అందువల్ల మగటర్కీలను ప్రతి 15 రోజులకొకసారి మారుస్తుండాలి.కృత్రిమ గర్భధారణ :

కృత్రిమ గర్భధారణవల్ల కలిగే ప్రయోజనమేమిటంటే, టర్కీలలో మొత్తం సీజనంతా బాగా ఎక్కువగా పునరుత్పత్తి సామర్ధ్యం వుంటుంది.


టీకాలు వేయించవలసిన తీరు

పుట్టిన మొదటిరోజు :  ఎన్‌డి - బి1 స్ట్రైన్ 
4వ, 5వ వారాలు:  ఫౌల్ పాక్స్ 
6వ వారం:   ఎన్‌డి - (ఆర్2 బి)
8-10 వారాలు:  కలరా టీకాలు


టర్కీల మార్కెటింగ్

16 వారాలకు ఎదిగిన టర్కీ పుంజు బరువు 7.26 కిలోలు, టర్కీ పెట్ట బరువు 5.53 కిలోలు వుండాలి. టర్కీల మార్కెటింగ్‌కు ఈ బరువులు అనువైనవి.

టర్కీ గుడ్డు:
  • టర్కీలు 30 వ వారం నుంచి గుడ్లుపెట్టడం మొదలుపెడతాయి; మొదటి గుడ్డుపెట్టిన రోజునుంచి 24 వారాలపాటు అది గుడ్లుపెడుతుంటుంది
  • తగిన దాణా ఇస్తూ, కృత్రిమ కాంతి ప్రసారంలో పెంచితే, టర్కీకోళ్ళు ఏడాదికి 60-100 గుడ్ల వరకుకూడా పెడతాయి
  • దాదాపు 70 %  గుడ్లు మధ్యాహ్న సమయంలోనే పెడతాయి
  • టర్కీ కోడి గుడ్లు, రంగుగా వుంటాయి, ఒక్కొక్కటి 85 గ్రాముల వరకు తూగుతాయి
  • గుడ్డు ఒక చివర గమనించదగినంతగా మొనదేలి, గట్టి పెంకుతో వుంటుంది
  • టర్కీ గుడ్డులో మాంసకృత్తులు, లిపిడ్ (కొవ్వు పదార్ధాలు), పిండిపదార్ధాలు, ఖనిజ లవణాల దామాషా  క్రమంగా 13.1%, 11.8%, 1.7% , 0.8% వుంటుంది. ఒక గ్రాము పచ్చసొనలో కొలెస్టొరాల్  15.67 - 23.97 మిల్లీ గ్రాములు వుంటుంది.  


టర్కీ మాంసం:

టర్కీ మాంసం చాలా పలుచగా వుంటుంది, అందువల్ల వినియోగదారులు టర్కీ మాంసాన్ని ఇష్టపడతారు. వందగ్రాముల మాంసం లో మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు , శక్తి విలువ 24%,6.6%, 162 కేలరీలు. టర్కీ మాంసంలో పొటాషియం, కాల్షియం (సున్నం), మెగ్నీషియం ఇనుము, సెలెనియం, జింక్, సోడియం మొదలైన ఖనిజ లవణాలు వుంటాయి. శరీరానికి తప్పనిసరిగా కావలసిన యామినో ఆ మ్లా లు, నియాసిన్, బి6,బి12 వంటి విటమిన్లు టర్కీ మాంసంలో పుష్కలంగా వుంటాయి. అసంతృప్త (అన్ శాచ్యురేటెడ్) ఫాటీ ఆ మ్లా లు, శరీరానికి తప్పనిసరిగా కావలసిన ఫాటీ ఆమ్లాలు, ఎక్కువగా వుండడమేకాక, కొలెస్టొరాల్ తక్కువగా వుండడం మరొక విశేషం. 24 వారాల వయసులో 10 - 20 కిలోల బరువున్న టర్కీ పుంజును విక్రయించడం వల్ల, దాని పెంపకానికి అయిన 300 - 450 రూపాయల ఖర్చుపోను, 500 - 600 రూపాయల ఆదాయం వస్తుందని మార్కెట్ అధ్యయనం తెలియజేస్తున్నది. ఇదే విధంగా, 24 వారాల వయసున్న టర్కీపెట్ట అమ్మకం వల్ల 300 - 450 రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇంతేకాక టర్కీలను కేవలం చెత్తాచెదారం తిని, లేదా మొత్తం దాణాలో కొంత చెత్తాచెదారం అందించి పెంచవచ్చు.