అన్నదాత >> పాడి పశువుల పెంపకం

పాడి పశువుల ఎంపికలో మెళకువలు

పాడి ఆవుల ఎంపిక
దూడలను, ఆవులను ప్రదర్శనల లో ఎంపిక చేసుకోవడం అనేది ఒక కళ. ఆవులను కొనేటప్పుడు, వాటి పాల ఉత్పత్తి మరియు ఈత సమర్ధతను చూసి కొనాలి. బాగా సమర్ధవంతంగా నడిపిన ఫారం నుంచి, పశువుల నాణ్యతను, చరిత్రను తెలుసుకొని కొనాలి. కొనాలనుకునే ఆవు పాలదిగుబడిని మూడుపూటలా తూచి ప్రతిసారి సగటున ఎన్ని పాలిస్తున్నాయో లెక్కకట్టుకోవాలి. పాలు పితకడానికి ఎవరినైనా దగ్గరకి రానివ్వ గలిగే ఆవుని మాత్రమే ఎన్నుకోవాలి. అక్టోబరు – నవంబరు మాసాలలో మాత్రమే కొనుగోలు చేయాలి. ఈనిన తొంబై రోజుల వరకు అధిక శాతం పాలను ఇవ్వాలి.

మంచి ఈత సామర్ధ్యం ఉన్న ఆవుల ఎంపిక

ఆవులు ఆరోగ్యంగా,చురుకుగా, ఆకర్షణీయంగా, ఆడ లక్షణాలతో నిండుగా ఉండాలి. మంచి శరీర సౌష్టవం కలిగి, శరీరము త్రికోణాకారముగా ఉండాలి.
కాంతి వంతమైన కన్నులు కలిగి, మెడ సన్నముగా ఉండాలి. పొదుగు చక్కని సమతులము కలిగి, పెద్దదిగా, నిడివిగా ఉండి  శరీరమునకు చక్కగా అంటిబెట్టుకొని ఉండాలి. పొదుగు క్రింద ఉండే పాలనరము పెద్దదిగా, ఉబ్బి వంకరటింకరగా ఉండాలి. చనుకట్లు ఒకే పరిమాణము కలిగి చతురస్రముగాను, సమదూరముగాను ఉండాలి.

వాణిజ్య సరళిలో నడిపే డైరీలను పాడి పశువుల ఎంపిక

భారతదేశ పరిస్ధితులలో ఒక్కొక్క డైరీ ఫారంకు. కనీసం 20  పశువులు ఉండాలి. (10 ఆవులు, 10 గేదెలు) ఈ లెక్కన  కొన్ని రోజులకు 50 :50 లేదా 40 – 60 నిష్పత్తిలో కనీసం 100 పాడి పశువుల వరకు నడవచ్చు. మన దేశంలో చాలా మటుకు తక్కువ క్రొవ్వు కలిగిన పాలను మాత్రమే ఇష్టపడతారు ఒక డైరీలే కలబోసిన జాతులు, ఉంటే మంచిది 
( సంకరపరచినవి, ఆవులు, గేదెలు ఒకే షెడ్లో వేరు వేరు వరుసలో ఉంచబడినవి) పాలు  విక్రమించుకునే ముందు, మార్కెట్టును బాగా తెలుసుకోవాలి. అవసరాన్నిబట్టి ఆవు పాలు, గేదెపాలు కలపొచ్చు కానీ, హొటల్స్, వినియోగదారులు ( 30 శాతం మంది ) ఎక్కువగా గేదె పాలను ఇష్టపడతారు. వైద్యశాలలు ఎక్కువగా ఆవు పాలను ఇష్టపడతారు.

ఆవుల ఎంపిక

మంచి నాణ్యత కలిగిన ఆవులు మార్కెట్ లో లభిస్తాయి. రోజుకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవు 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధతో చూచిన ప్రతి ఆవు 13 – 14 నెలల వ్యత్యాసంలో ఒక్కొక్క దూడను ఈనుతుంది. ఆవు పాలలోని క్రొవ్వు శాతం 3 -5.5 వరకు ఉంటుంది. ఇది గేదె పాల కంటే తక్కువ.

గేదెల ఎంపిక

డైరీ ఫారంలకు బాగా అనువైన ముర్రా, మెహసనా జాతి గేదెలు మన దేశంలో బాగా అనువైనవి. క్రొవ్వు శాతం ఆవు పాల కంటే ఎక్కవగా ఉన్నందువల్ల గేదె పాలను ఎక్కువగా వెన్న, నెయ్యి తయారీకి ఉపయోగిస్తారు.ఇండ్లలో టీ తయారీకి ఎక్కువగా కూడా ఉపయోగిస్తారు. గేదెల పోషణకి పీచు ఎక్కువ కలిగిన వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలను ఉపయోగించవచ్చు. అందువల్ల తక్కువ ఖర్చుతో గేదెలను మేపవచ్చు. గేదెలు ఎక్కువ వేడిని తట్టుకోలేవు. అందువల్ల వాటిని చల్ల బరచడానికి, ఫ్యాన్, షవర్లు అవసరం. గేదెలు ఈతకు ఆలస్యంగా వస్తాయి. ఈతకు ఈతకు 16నుంచి 18 నెలలు సమయం పడుతుంది.