అన్నదాత >> పాడి పశువుల పెంపకం

పాడి ఆవులు

పాడి ఆవులు

సాహివాల్

 • ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ, బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో :1350 కిలోలు
  – వాణిజ్య డైరీ ఫారంలో: 2100కిలోలు
 • మొదటిసారి ఈతకు వచ్చినవపుడు వయసు -32-36 నెలలు
 • ఈతకు, ఈతకు మధ్య సమయం 15 నెలలు

గిర్

 • దక్షిణ కధిమవార్ ప్రాంతాలలోని గిర్ అడవులలో ఉంటుంది.
 • పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో- 900 కిలోలు
  – వాణిజ్య డైరీ ఫారంలో -1600 కిలోలు

తార్ పార్ కర్

 • జోద్ పూర్, కచ్, జైసల్మార్ ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో- 1600 కిలోలు
  – వాణిజ్య డైరీ ఫారంలో-2500 కిలోలు

కరణ్ ఫ్రీ

రాజాస్తాన్ కి చెందిన థర్పర్కర్ జాతి ఆవులను హోల్స్టీన్ ఫ్రీష్ ఆబోతులతో కృత్రిమ గర్భధారణ చేయించి కరణ్ ఫ్రీ జాతిని అభివృద్ది చేశారు. థర్పర్కర్ జాతి ఆవుల పాల దిగుబడి సామాన్యంగానే ఉన్నప్పటికీ, ఇవి అధిక ఉష్ణోగ్రతను, తేమతో కూడిన వాతావరణాన్ని తట్టుకోగల శక్తిని కలిగి ఉండడం వలన ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

 • ఈ జాతి లక్షణాలు
 • ఈ జాతి ఆవులు శరీరం మీద, నుదుటి మీద, తోక కుచ్చు మీద నలుపు తెలుపు మచ్చలు కలిగి ఉంటాయి. పొదుగు ముదురు రంగులో ఉండి చన్నుల మీద తెల్లటి మచ్చలుంటాయి. పాలిచ్చేనరాలు ఉబ్బి ఉంటాయి.
 • కోడె దూడల కన్నా పెయ్య దూడలు తొందరగా ఎదుగుదలకు వచ్చి 32-34 నెలల వయసులోనే గర్భం దాలుస్తాయి.
 • గర్భధారణ అవధి సాధారణంగా 280 రోజులు ఉంటుంది. ప్రసవం జరిగిన 3 - 4 నెలలలోపే తిరిగి గర్భం దాలుస్తాయి. అందువల్ల తిరిగి గర్భందాల్చడానికి 5-6 నెలలు తీసుకునే స్థానిక జాతుల కన్నా మెరుగైనవి.
 • పాల దిగుబడి: కరణ్ ఫ్రీ జాతి ఆవులు సంవత్సరానికి 3 ,000 నుండి 3,400 లీటర్ల పాలు ఇస్తాయి. పరిశోధనా స్థానం వారి ఫారంలో ఈ జాతి ఆవుల పాల దిగుబడి 320 రోజుల కాలంలో 3,700 లీటర్లు కాగా వెన్న శాతం 4.2 ఉందని తెలిసింది.
 • సమతుల్యమైన సాంద్ర దాణా మిశ్రమం, పచ్చిమేత విరివిగా మేపినప్పుడు ఈ జాతి ఆవులు రోజుకి 15 - 20 లీటర్ల పాలు ఇస్తాయి. పాలు బాగా వచ్చే సమయంలో (అంటే దూడ పుట్టిన 3-4 నెలలకు) పాల దిగుబడి రోజుకు 25-35 లీటర్ల వరకూ పెరగవచ్చు.
 • పాల దిగుబడి అధికంగా ఉన్నందున, బాగా పాలు ఇచ్చే ఆవులకు పొదుగు వాపు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. పోషక లోపాలు కూడా తలెత్తవచ్చు. ముందుగా పసికట్టగలిగితే వీటిని నివారించుకోవచ్చు.

   


  దూడ ఖరీదు: కొత్తగా ఈనిన ఆవు అది ఇచ్చే పాల దిగుబడిని బట్టి రూ. 20,000 నుండి 25 ,000 వరకూ ఉంటుంది.
  సమాచారం కొరకు:

ఎర్ర సింధి

 • పంజాబ్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఒరిస్సా ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి   – గ్రామీణ ప్రాంతాలలో-1100 కిలోలు kgs
  – వాణిజ్య డైరీ ఫారంలో-1900 కిలోలు.