అన్నదాత >> పాడి పశువుల పెంపకం

పాడి మరియు సేద్య యోగ జాతులు

ఒంగోలు

 • ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు,ప్రకాశం, కృష్ణ , గోదావరి మరియు గుంటూరు జిల్లాలలో లభిస్తుంది.
 • పాల దిగుబడి – 1500 కిలోలు
 • ఎద్దులు పొలం దున్నడానికి మరియు బండి కట్టడానికి బాగా అనువైనవి.

హరియానా

 • హర్యానాలోని కర్నల్, హిస్సార్, గుర్ గావ్ జిల్లాలలో మరియు పడమర మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి- 1140-4500 కిలోలు
 • ఎద్దులు రవాణాకి మరియు పొలం దున్నడానికి అనువైనవి.

కాంగ్రెజ్

 • గుజరాత్ లో ఎక్కువగా ఉంటుంది.
 • పాల దిగుబడి - గ్రామీణ ప్రాంతాలలో-1300 కిలోలు
  – వాణిజ్య సరళిలో- 3600 కిలోలు
 • ఈతకు వచ్చినవపుడు వయసు- 36-42 నెలలు
 • ఈతకు, ఈతకు మధ్య సమయం -15నుంచి 16 నెలలు
 • ఎద్దులు బలంగా, హూషారుగా ఉండి,దున్నటానికి, బండి కట్టడానికి పని కొస్తుంది.

డియోని

 • ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర మరియు పడమర ప్రాంతాలలో ఉంటుంది
 • పాడి ఆవులు అధిక పాల దిగుబడికి, ఎద్దులు పొలం పనులకు అనువైనవి.

సేద్యయోగ జాతులు

అమ్రిత మహల్

 • కర్ణాటకలో ఎక్కువగా లభిస్తుంది.
 • పొలం దున్నడానికి, రవాణాకు బాగా ఉపయోగపడుతుంది.

హల్లికార్

 • కర్ణాటకలోని తుమ్ కూర్, హసన్, మరియు మైసూర్ జిల్లాలలో ఉంటుంది.

కంగాయమ్

 • తమిళనాడులోని కోయంబత్తూరు, ఈరోడ్ , నమక్కల్, కరూర్ మరియు దిండిగల్ ప్రాంతాలలో ఉంటుంది.
 • పొలం దున్నడానికి మరియు రవాణాకు అనువైనది. దుర్బర పరిస్ధితులను కూడా తట్టుకోగలదు

విదేశీ పాడి ఆవుల జాతులు

జైర్సీ

 • మొదటి ఈతకు వయసు – 26-30 నెలలు
 • ఈతకు, ఈతకు మధ్య సమయం 13-14 నెలలు
 • పాల దిగుబడి - 5000-8000 కిలోలు
 • డైరీ పాల దిగుబడి 20 లీటర్లు , కానీ సంకరజాతి జెర్సీ పాల దిగుబడి 8-10 లీటర్లు ఒక రోజుకి.
 • భారతదేశంలో ఈ జాతి ఆవులు మనదేశ ఉష్ణ ప్రదేశాలకు బాగా అలవాటు పడ్డాయి

హౌలిస్టిన్ ఫ్రిజియన్

 • ఈ జాతి ఆవు హాలాండ్ నుంచి దిగుమతి చేసుకోబడింది
 • పాల దిగుబడి 7200-9000 కిలోలు
 • విదేశీ జాతులలో ఈ జాతి ఆవు పాల దిగుబడిలో అత్యంత శ్రేష్ఠమైనది
 • సగటున రోజుకు 25 లీటర్లు పాలు ఇస్తుంది,అదే సంకర పరచిన ఈ ఆవు సగటున 10-15 లీటర్లు రోజుకు దిగుబడినిస్తుంది. కోస్తా ఆంధ్రా ప్రాంతాలకు బాగా అనువైనది.

గేదెల జాతులు

ముర్రా

 • హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి 1560 కిలోలు.
 • సగటున రోజుకు 8-10 లీటర్లు పాలు ఇస్తుంది. సంకర పరచిన ముర్రా గేదె రోజుకు 6-8 లీటర్లు ఇస్తుంది.
 • కోస్తా ప్రాంతాలలో మరియు శీతోష్ణ ప్రదేశాలకు అనువైనది.

సుర్తీ

 • గుజరాత్ లో లభిస్తుంది
 • పాల దిగుబడి 1700-2500 కిలోలు

జఫరాబాద్

 • గుజరాత్ లోని కతైవార్ ప్రాంతములో ఉంటుంది
 • పాల దిగుబడి 1800-2700 కిలోలు