బిందు సేద్యం

ప్రధాన వాహకాలు, ఉప వాహకాలు, మరియు పక్క వాహకాలతో విడుదల చేసే స్థానాలకు వాటి దైర్ఘ్యాలను బట్టి దూరాన్ని కల్పించి పంటకు విస్తృత పరిధిలో నుంచి నీటిని బిందు సేద్యం ద్వారా అందించాలి. ప్రతి ఉత్సర్గ నాళం నుండి బిందువుగా పడే సూక్ష్మ రంధ్రం నుంచి సరఫరా అయ్యే పరిమాణాన్ని ఖచ్చితంగా  నియంత్రించిఒకే రీతిగా నీరు, పోషకాలు, మరియు పెరుగుదలకు కావలసిన ఇతర పదార్ధాలు నేరుగా వేరు ప్రాంతానికి అందేటట్లుచేస్తుంది.
ఉత్సర్గ నాళం నుంచి వెలువడిన నీరు, పోషకాలు నేలలోకి చేరి గురుత్వాకర్షణ శక్తి, కేశనాళికీయతలతో కదిలి నీరు మొక్క యొక్క వేరు ప్రాంతానికి చేరుతుంది. భర్తీ అయిన తేమను, పోషకాలను మొక్కలు వినియోగించుకుంటూ నీటి కొరతకు లోనుగాకుండా పొందుతూ కావలసిన నాణ్యతను, పెరుగుదలను, ఎక్కువ దిగుబడిని అందిస్తుంది.

నమూన బిందు సేద్య విధాన రూప కల్పన
మానవ జాతికి నీరు ప్రకృతి ఇచ్చిన వరం. ఇది ఎప్పటికీ అమూల్యం, అపరిమితం. నేడు బిందు సేద్యం అవసరం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు తరిగి పోతున్నాయి.

బిందు సేద్య విధానంయొక్క ప్రయోజనాలు

  • 150 శాతం వరకు దిగుబడి పెరుగుతుంది.
  • ధారాళంగా నీటిని అందించే విధానంతో పోలిస్తే బిందు సేద్యం ద్వారా 70 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. ఎక్కువ నేలకు ఈ సే ద్యం ద్వారా నీటిని ఆదా చేస్తూ చేయవచ్చు.
  • అరటి పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉండి త్వరగా పక్వానికి వస్తుంది.
  • ఫలసాయం త్వరితంగా ఏర్పడి, ఫలితం అధికంగా ఉండడం వల్ల వెను వెంటనే పెట్టి న పెట్టుబడి వచ్చేస్తుంది.
  • ఎరువుల వాడకం వలన ఫల సామర్ధ్యం 30 శాతం పెరుగుతుంది.
  • అంతర్‌  కృషి, శ్రమ  వలన ఎరువుల ఖర్చు తగ్గుతుంది.
  • సూక్ష్మ నీటి పారుదల ద్వారా ఎరువులు, రసాయనాలను ఇవ్వడం జరుగుతుంది.
  • అలలలాగా ఉండే కొండ చరియలు, ఉప్పు నీటి ప్రాంతాలు, నీరు నిల్వ ప్రాంతాలు, ఇసుక, కొండ ప్రాంతాలను కూడా ఉత్పాదక సాగుకి వినియోగించవచ్చు.