ఖచ్చిత వ్యవసాయం

  • ఖచ్చిత సాగు లేదా ఖచ్చిత వ్యవసాయం అనేది ఆధునిక పరిజ్ఞానాలను, సేకరించిన పొలం సమాచారాన్ని సరైన సమయంలో, సరైన చోట, సరైన రీతిలో వాడే ఒక కొత్త పంథా. సేకరించిన సమాచారాన్ని  విత్తడానికి  కావలసిన  సరైన సాంద్రతనూ, ఎరువుల అవసరాలనూ, ఇతర వస్తువుల అవసరాలను అంచనావేయడానికి దిగుబడిని ఖచ్చితంగా అంచనావేయడానికి వాడతారు.   
  • స్దానిక నేల, వాతావరణ పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఒక పంటకు అనావశ్యమైన అలవాట్లను మానడానికి ఇది ఎంతో తోడ్పడ్తుంది. అంటే, ఇది పనివారిసంఖ్య, నారు, ఎరువులు, క్రిమి సంహారకాలవంటి   వాటి అనవసర ఖర్చులను నివారించి, నాణ్యమైన ఉత్పత్తులకు దోహదం చేస్తుంది.