చపాతి

చపాతి

కావలసిన వస్తువులు:
గోధుమపిండి - అరకిలో.
వెన్న - 10 - 15 గ్రా||.
పాలు - 25 మిల్లీ.
నూనె - 200 మిల్లీ.
పెరుగు - అరకప్పు.
అరటిపండు - 1.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

నూనె తప్ప మిగతా సరుకులన్నీ, తగినన్ని నీళ్ళుపోసి పిండిలా కలిపెయ్యాలి. బాగా బలంగా పిసికి పెట్టాలి. రేపు ఉదయం చపాతీలు చెయ్యాలంటే ఈ రాత్రే ముద్ద రెడీగా ఉండాలి. ఉదయం ఈ ముద్దని నిమ్మకాయంత వుండలుగా చేసుకొని అప్పడాల పీటమీద అప్పడాల కర్రతో కావలసిన షేపులో దళసరిగానో, పల్చగానో వత్తుకోవాలి. పెనం వేడిచేసి ఆయిల్ రాసి పొగలురాగానే చపాతీలు వెయ్యాలి. తిరగేసేటప్పుడు కూడా ఆయిల్వేస్తే తినేందుకు మహారుచిగా వుంటాయి. అసలు ఆయిలే వెయ్యకుండా చేసుకుంటే మరీ ఆరోగ్యం! ఈ చపాతీలని ఏ అనుపానంతోనైనా తినేయొచ్చును. కాని, బంగాళదుంప కుర్మానే ప్రత్యేకంగా చేసుకుంటారు.
టిఫిన్స్
 

చింతపండు పులిహార

 

పూరి

 

చపాతి

 

పెసరట్టు

 

ఇడ్లీ

 

మసాలా దొసె