Untitled Document
తెలుగులొ వ్రాయడానికి ఉపకరణాలు
తెలుగుభాష.ఇన్
   పాల్కురికి సోమన
  ద్విపద కావ్యరచనల్లో సుప్రసిద్ధుడయిన పాల్కురికి సోమనాధుడు 12-13 శతాబ్దాల మద్యకాలంలో వరంగల్లు జిల్లాలోని పాల్కురికి అనే గ్రామంలో శ్రీయా దేవి,విష్ణురామిదేవుడు దంపతులకు జన్మించాడు. ఆ వూరిలోని సోమేశ్వరుని అనుగ్రహంతో పుట్టడం వల్ల సోమనాధుడు అనే పేరు పేట్టారు.
సోమన రచనలు అచ్చ తెలుగులో ఎంతో సరళంగా ఉండి పామరులకు సైతం అర్ధమవుతాయి.ఇతని రచనలన్ని స్వతంత్రాలే.తన రచనల్లో రగడ శతకం,గద్య,ఉదాహరణం మొదలైన సాహత్య ప్రక్రియలను చేపట్టాడు.సోమన రచనల్లో సరళ గంభీరతలు,సౌందర్య మాధుర్యాలు,తెలుగు పలుకు బళ్ళు - సంస్కృత పదాలు సమానంగా కనిపిస్తాయి.
ఇతడి రచనల్లో బసవపురాణం,పండితారాధ్య చరిత్రలు ప్రముఖమైనవి.ఇవి కాక అనుభవసారం,వృషధిప శతకం, చతుర్వేదసారం,సోమన పద్యకృతులు,రుద్ర భాష్యం,సోమనాధ భాష్యం,బసవ రగడ,సద్గురు రగడ,పంచప్రకార గద్య,సమస్కారగద్య,బసవోదాహరణం మొదలయినవి ఎన్నో రచించాడు.
Feedback - telugubhasha.in@gmail.com