Untitled Document
తెలుగులొ వ్రాయడానికి ఉపకరణాలు
తెలుగుభాష.ఇన్
   బతుకమ్మ నృత్యం
   బతుకమ్మ నృత్యం ఆంధ్రప్రదెశ్ లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ నృత్యం.నిండు ముత్తయిదువులు గౌరీ దేవిని కొలూస్తూ తమ పసుపు కుంకాలు,పిల్లా,పాపా అంతా చక్కగా ఉండాలని గ్రామ ప్రజలు అంతా బాగుండాలని చేసే నృత్యమే బతుకమ్మ నృత్యం.
బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ప్రాంతంలో అశ్వయుజ మాస శుద్ద పాడ్యమి నుండి తొమ్మిది రోజులు వరకూ జరుపుకుంటారు.స్త్రిలు బతుకమ్మ రూపాన్ని పూలతో గుడి గోపురంలా తయారు చేసి ఓక పళ్ళెంలో ఉంచి ఆ గోపురంపై పసుపు ముద్దని ఉంచుతారు.ఈ పసుపుముద్దనే బతుకమ్మ అని అంటారు.
   సాయంకాల సమయంలో స్త్రిలు ఈ బతుకమ్మని భక్తి శ్రద్దలతో పూజించి ప్రసాదం నైవేద్యం పెట్టీ ఆ తర్వాత దాన్ని అందరికి పంచుతారు.ఇలా 9రోజులు పాటు చేసిన తర్వాత 10వ రోజు ఈ బతుకమ్మలను నిమర్జనం చేయ్యడానికి తీసుకువెళ్ళి నిమర్జనం చేసే ముందు ఈ బతుకమ్మలను మద్యలో ఉంచి ఆ బతుకమ్మల చుట్టూ స్త్రీలు చప్పట్లూ చరుస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు.దిన్నే బతుకమ్మ నృత్యం అని పిలుస్తారు.ఈ నృత్యం అయిన తర్వాత బతుకమ్మలను నీటిలో జల నిమర్జనం చేస్తారు.బతికమ్మ పూజనే ఆంద్రా ప్రాంతంలో మంగళగౌరీ వ్రతంగా పిలుస్తారు.
   బతుకమ్మ గురించి అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి.చోళ చక్రవర్తి అయిన ధర్మాంగదుడు సంతానం కోసం అనేక వ్రతములను ఆచరించగా ఆయన భార్య అయిన సత్యవతికి లక్ష్మి దేవి అంశతో ఒక బాలిక జన్మించింది.ఈ బాలిక పుట్టగానే ఆమెని ఆశిర్వదించడానికి వచ్చిన మునిపుంగవులు ఆశిర్వదిస్తూ చిరకాలం బతుకమ్మ అని అన్నారట.దీంతో ఆ బాలికకు ఆ రాజ దంపతులు బతుకమ్మ అని నామకరణం చేసారని చెబుతారు.
Feedback - telugubhasha.in@gmail.com