Untitled Document
తెలుగులొ వ్రాయడానికి ఉపకరణాలు
తెలుగుభాష.ఇన్
   బుర్ర కధ
      తెలుగు వారికి బాగా పరిచయమున్న కళారూపకం బుర్రకధ.దీని ప్రదర్శనలో ముగ్గురు సభ్యులు ఉంటారు.మద్యలో ఉన్న వ్యక్తి తుంబుర భుజానికి ఎత్తుకుని మీట మీటుతూ కధ చెబుతుంటే మిగతా ఇద్దరూ తాన తందాన అంటూ వంత పాడుతూ ప్రశ్నలు సంధిస్తూ,పిట్ట కధలు చెబుతూ హాస్యాని పండిస్తూ చూసే వారికి ఉత్సాహాన్ని కలిగిస్తారు.మధ్యలో ఉండే వ్యక్తి భుజానికి ఎత్తుకున్న తుంబుర బుర్ర ఆకారంలో ఉండటం మూలంగా దీనికి బుర్ర కధ అనే పేరు వచ్చింది.
    వీటి ప్రదర్శనలో కళాకారులు ముఖ్యంగా వీర,రౌద్ర రసాల ఇతి వృత్తాలను ఎన్నుకుని నవరసాలను పలికిస్తూ చూసే వారిని మంత్ర ముగ్దులని చేస్తారు.రామాయణ కాలం నుండే ఈ బుర్ర కధలు ప్రచారంలో ఉన్నాయని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అల్లూరి సీతారమ రాజు బాల నాగమ్మ,బొబ్బిలి యుద్ధ మొదలయిన వాటిని కధలుగా అల్లి ప్రదర్శించి ప్రజల్లొ ఉద్యమ స్పూర్తిని రగిల్చేవారు.ఇప్పటికీ మన ప్రభుత్వం ప్రజా చైతన్య విషయాలయిన ఎయిడ్స్,కుటుంభ నియంత్రణ తదితరాలను ప్రజల్లోకి తేలికగా తీసుకెళ్ళేందుకు బుర్ర కధల తొనే ప్రచారం చేయిస్తుంది.
Feedback - telugubhasha.in@gmail.com