తెలుగుని కాపాడుకోవాలి - బాబు


గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగుభాష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. భారత దేశంలో హిందీకి పలు రాష్ర్టాలు ఉన్నాయని, మిగిలిన భాషలన్నిటికి ఒకటే రాష్ట్రం ఉంటే తెలుగు భాషకు రెండు రాష్ర్టాలు ఉన్నాయని అన్నారు. మనం భాషను కాపాడుకోవాలని, తెలుగు బాషను కాపాడుకుంటే మన ఉనికిని కాపాడుకున్నట్టు అవుతుందని ఆయన అన్నారు. భాషను మరిచిపోతే మన ఉనికిని మరిచిపోయినట్లు అవుతుందని అన్నారు. దేశంలో హింది తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది తెలుగు భాషేనని ఆయన పేర్కొన్నారు. ఈ రోజున ప్రపంచీకరణలో ఇంగ్లీషు భాష కూడా చాలా ముఖ్యంగా తయారైందని, ఇది కేవలం మన ఉద్యోగ అవసరానికి ఉపయోగపడుతుందని, భాష అనేది మన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని కాపాడుకోడానికి చాలా అవసరమని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగువారు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో రాణిస్తున్నారని, ఏ దేశమేగినా తెలుగు బాషను కాపాడుతున్నారని ఆయన కొనియాడారు తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని నిరవధిక నిరాహార దీక్ష చేసి, ప్రాణాలు ఆర్పించి.. తెలుగు రాష్ట్రం సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగువారికొక ప్రత్యేకత ఉందని, మాకూ ఒక రాష్ట్రం ఉందని, మా జాతి అన్ని జాతుల కంటే గొప్ప జాతి అని నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావని ఆయన కొనియాడారు. పాఠశాల దశ నుంచి పదోతరగతి వరకు తెలుగు బాషను రెండో భాషగా చేస్తామని ఈ రోజు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇంటర్‌ వరకు రెండో బాషగా తెలుగే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంతే కాకుండా తెలుగు ఉర్దూ భాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెడతామని, ప్రత్యేక బడ్జెట్‌ కూడా ఇస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం పల్లె రఘునాధరెడ్డిని ప్రత్యేక మంత్రిగా నియమించామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ వ్యవహారాలన్ని సాధ్యమైనంత వరకు తెలుగులోనే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల్లో మన కళలకు ఆదరణ పెరిగేలా కార్యకలాపాలు సాగించామని ఆయన తెలిపారు. తెలుగు జాతి గర్వపడేలా రాజధాని నిర్మాణం చేపడతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, జిల్లాకో మాండలిక పదకోశం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తెలుగులోనే బోర్డులు ఉండేలా చర్యలు తీసుకుంటామని, కూచిపూడి నాట్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, కూచిపూడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలుగు భాష అభివృద్ధికి నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పొట్లూరి హరికృష్ణను నామినేట్‌ చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చిన పీఠాన్ని మైసూర్‌లో ఏర్పాటు చేశారని, ఆ పీఠాన్ని ఏపీకి తరలించేందుకు కృషి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి   పరభాష వ్యామోహం వీడాలి
  నేడు తెలుగు భాషా దినోత్సవం   నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా
  తెలుగు భాష విశిష్టత   తెలుగు పరీక్షని అడ్డుకోవద్దు
  మాతృభాషతోనే ఇతర బాషలపై పట్టు   తెలుగుని కాపాడుకోవాలి - బాబు
  తెలుగు భాష రక్షణ ఇలా..   తెలుగు వ్యాప్తికి మనబడి వినూత్న ప్రయత్నం
  మలేసియాలో ఉగాది సంబరాలు   తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు
  ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు   అనంతవరంలో ఘనంగా ఉగాది వేడుకలు
  నూతన రాజధానిలో ఉగాది వేడుకలు   ఉగాదితో సకల సౌభాగ్యాలు
  షడ్రుచుల సమ్మేళనం ఉగాది   రూ 5 కోట్లతో ఉగాది ఉత్సవాలు
  వైభవంగా జగన్నాథ రథయాత్ర   అందరికీ ఆరోగ్యశ్రీ
  నోట్లపై సరికొత్త ఫొటోలు   కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
  రాష్ట్రపతి రేసులో అబ్దుల్ కలాం!   తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
  జూలై 6 నుంచి లాల్‌దర్వాజా బోనాలు   ఉప సమర వీరులు వీరే
  మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం   రాష్ట్రపతిగా ప్రణబ్
  రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర   25న దేశ వ్యాప్త వైద్య సమ్మె
  మరో రూ.2 తగ్గనున్న పెట్రోలు!   25న మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
  తత్కాల్ ప్రయాణికులకు ఊరట..   మంద్ కోడిగా ఋతుపవనాలు
  వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బీఐ   16 నుంచి రాష్ట్రవ్యాప్త జాబ్ ఫెయిర్
  టెట్‌ ప్రాథమిక కీ విడుదల   ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
  తేరుకుంటున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు   ఖగోళ అద్భుతం.. శుక్ర అంతర్యానం
  తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ   దేశానికి రుణపడి ఉంటాను: విశ్వనాథ్ ఆనంద్
  ఎడ్‌సెట్ హాల్‌టికెట్ల జారీ ప్రారంభం   4న సచిన్ ప్రమాణ స్వీకారం
  జూన్ 1కి టెట్ వాయిదా   కూచిపూడి భావితరాలకు స్పూర్తి
  జూన్‌ 4 నుంచి రైతు సదస్సులు   ఆకాష్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం
  కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత   19వ రోజుకు చేరిన పైలట్ల సమ్మె
  దుబాయ్‌లో తెలుగు వేవ్   ఈ సారి డీజిల్ బాంబు ?
  జూన్ 7వరకూ మోపిదేవికి రిమాండ్   31న భారత్ బంద్‌కు ఎన్డీఏ పిలుపు
  28నుంచి వీఆర్వో అభ్యర్థులకు కౌన్సిలింగ్   పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
  ఐపీఎల్-5: ఫైనల్లో కోల్‌కతా   గూగుల్ సైన్స్ ఫెయిర్‌కు హైదరాబాదీ
  నామినేషన్ నుంచే అభ్యర్థి ఖర్చు: భన్వర్‌లాల్   పదో తరగతి ఫలితాలు ఎల్లుండికి వాయిదా
  రాష్ట్రంలో మండుతోన్న ఎండలు   అమర్త్యసేన్‌కు గౌరవ డాక్టరేట్
  31న జరగనున్న టెట్ పరీక్ష   కామన్వెల్త్ లిఫ్టింగ్‌కు తెలుగు తేజాలు