అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ (1999 నవంబరు 17న) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతీ ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలనీ భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో పదే పదే ప్రకటించింది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో పదే పదే ప్రకటిస్తోంది. 2002లో ఈ సందర్భంగా యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ తన సందేశంలో ఇలా చెప్పారు: ‘ప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటికంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో స్కూల్లో తోటి విద్యార్థులతో మాట్లాడతామో, ఆ భాష మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది. మాతృభాషా దినోత్సవ ప్రకటన సదర్భంగా ప్రపంచంలోని అన్ని భాషలు సమానంగా గుర్తించబడ్డాయి. ప్రతి భాషా మానవ ప్రతిస్పందనల విశిష్టతలను కలిగి ఉంటుంది. ప్రతి భాషకు సంబంధించిన సజీవ వారసత్వాన్ని మనం అనుభవించాలి’ అని ఆయన ప్రకటించారు.
ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవలసింది ఏమిటంటే - మాతృభాషలోనే భావోద్వేగాల అభివ్యక్తిని, జ్ఞానాభివృద్ధిని సమున్నతంగా సాధించగలమని. అదే సమయంలో తన వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భాషీయుడి హక్కు అని, తన భాషను కాపాడుకోవడం ద్వారానే ఇది సాధ్యమని.
భాషను బట్టే జాతి గుర్తించబడుతుంది. కాలగమనంలో రాజ్యాల సరిహద్దులు, పాలకులు మారినా ఆయా జాతుల మాతృభాషలు మారవు. పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ ఇందుకు ఒక ఉదాహరణ. మన దేశంలోనే మన తెలుగు జాతిలోనే ఇటీవల రాష్ట్ర విభజన ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర-తెలంగాణలు మరొక ఉదాహరణ. ప్రాంతాలను బట్టి, ప్రాకృతికతను బట్టి ఒకే భాషాజాతిలో నెలకొనే సాంస్కృతిక వైవిధ్యాలను, వారి వారసత్వాలను కూడా కాపాడుకోవాలని యునెస్కో సందేశం విశదపరుస్తోంది. ప్రపంచంలోని మౌలిక, వైరూప్య వారసత్వాన్ని రక్షించాలనే ప్రయత్నంలో భాగంగానే భాష విషయంలో యునెస్కో కృషి చేస్తోంది. సంప్రదాయ ప్రజా సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం - వీటిని రక్షించుకోవడం మాతృభాషల రక్షణతోనే వీలవుతుంది. మాతృభాషను కోల్పోతే వారసత్వంగా సాధించుకున్నదంతా కోల్పోయి, ఆ జాతి పూర్తిగా పరాయీకరణ పొంది గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా పెద్ద భాషలతోపాటు చిన్న, అతి చిన్న భాషలను కూడా కాపాడవలసి ఉంది. మన రాషా్ట్రల్లోనే ఉన్న గిరిజన భాషలను కూడా రక్షించవలసిన అవసరాన్ని మన దేశంలోని పెద్ద భాషల రాషా్ట్రలు, ప్రభుత్వాలు గుర్తించవలసి ఉంది.
తాజా వార్తలు
 

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి

 

పరభాష వ్యామోహం వీడాలి

 

నేడు తెలుగు భాషా దినోత్సవం

 

నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా

 

తెలుగు భాష విశిష్టత

 

తెలుగు పరీక్షని అడ్డుకోవద్దు

 

మాతృభాషతోనే ఇతర బాషలపై పట్టు

 

తెలుగుని కాపాడుకోవాలి - బాబు

 

తెలుగు భాష రక్షణ ఇలా..

 

తెలుగు వ్యాప్తికి మనబడి వినూత్న ప్రయత్నం

 

మలేసియాలో ఉగాది సంబరాలు

 

తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు

 

ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు

 

అనంతవరంలో ఘనంగా ఉగాది వేడుకలు

 

నూతన రాజధానిలో ఉగాది వేడుకలు

 

ఉగాదితో సకల సౌభాగ్యాలు

 

షడ్రుచుల సమ్మేళనం ఉగాది

 

రూ 5 కోట్లతో ఉగాది ఉత్సవాలు

 

వైభవంగా జగన్నాథ రథయాత్ర

 

అందరికీ ఆరోగ్యశ్రీ

 

నోట్లపై సరికొత్త ఫొటోలు

 

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

 

రాష్ట్రపతి రేసులో అబ్దుల్ కలాం!

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

 

జూలై 6 నుంచి లాల్‌దర్వాజా బోనాలు

 

ఉప సమర వీరులు వీరే

 

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

 

రాష్ట్రపతిగా ప్రణబ్

 

రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర

 

25న దేశ వ్యాప్త వైద్య సమ్మె

 

మరో రూ.2 తగ్గనున్న పెట్రోలు!

 

25న మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

 

తత్కాల్ ప్రయాణికులకు ఊరట..

 

మంద్ కోడిగా ఋతుపవనాలు

 

వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

 

16 నుంచి రాష్ట్రవ్యాప్త జాబ్ ఫెయిర్

 

టెట్‌ ప్రాథమిక కీ విడుదల

 

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

 

తేరుకుంటున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు

 

ఖగోళ అద్భుతం.. శుక్ర అంతర్యానం

 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

 

దేశానికి రుణపడి ఉంటాను: విశ్వనాథ్ ఆనంద్

 

ఎడ్‌సెట్ హాల్‌టికెట్ల జారీ ప్రారంభం

 

4న సచిన్ ప్రమాణ స్వీకారం

 

జూన్ 1కి టెట్ వాయిదా

 

కూచిపూడి భావితరాలకు స్పూర్తి

 

జూన్‌ 4 నుంచి రైతు సదస్సులు

 

ఆకాష్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

 

కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత

 

19వ రోజుకు చేరిన పైలట్ల సమ్మె

 

దుబాయ్‌లో తెలుగు వేవ్

 

ఈ సారి డీజిల్ బాంబు ?

 

జూన్ 7వరకూ మోపిదేవికి రిమాండ్

 

31న భారత్ బంద్‌కు ఎన్డీఏ పిలుపు

 

28నుంచి వీఆర్వో అభ్యర్థులకు కౌన్సిలింగ్

 

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

 

ఐపీఎల్-5: ఫైనల్లో కోల్‌కతా

 

గూగుల్ సైన్స్ ఫెయిర్‌కు హైదరాబాదీ

 

నామినేషన్ నుంచే అభ్యర్థి ఖర్చు: భన్వర్‌లాల్

 

పదో తరగతి ఫలితాలు ఎల్లుండికి వాయిదా

 

రాష్ట్రంలో మండుతోన్న ఎండలు

 

అమర్త్యసేన్‌కు గౌరవ డాక్టరేట్

 

31న జరగనున్న టెట్ పరీక్ష

 

కామన్వెల్త్ లిఫ్టింగ్‌కు తెలుగు తేజాలు